current affairs telugu

డైలీ కరెంట్ అఫైర్స్ 02/08/2024

  1. భారతదేశం యొక్క ఏప్రిల్-జూన్ ఆర్థిక లోటు రూ. 1.36 లక్షల కోట్లు.

 

  1. లెఫ్టినెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ బాక్సింగ్‌లో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ఒలింపిక్ రిఫరీ అయ్యాడు.

 

3.ఆగస్టు 1న భారత్ మరియు వియత్నాం తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

 

  1. మంగళూరు కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్‌ను పారాదీప్ ఫాస్ఫేట్‌లతో విలీనం చేయడం CCI ఆమోదించింది.

 

  1. కర్ణాటక ప్రభుత్వం రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చింది.

 

  1. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (UPDIC) కింద మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

 

  1. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో ఉంది.

 

  1. రిజర్వేషన్ల కోసం SC మరియు STలను ఉప-వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 

  1. KIIT DU ప్రతిష్టాత్మక UN ECOSOC ప్రత్యేక సంప్రదింపు హోదాను పొందింది.

 

  1. స్వప్రిల్ కుసాలే 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ షూటింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

 

11.జులై 30, 2024న, సంజయ్ శుక్లా నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో అధికారికంగా మేనేజింగ్ డైరెక్టర్ (MD) పదవిని చేపట్టారు.

 

  1. ‘కమింగ్ ఏజ్ ఆఫ్ ఇండియా మ్యూజియంలపై స్టేట్ మ్యూజియం కాన్ఫరెన్స్’ ప్రారంభించబడింది.

 

  1. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్ (ఆర్మీ)గా నియమితులైన మొదటి మహిళ.

 

14.ప్రతి సంవత్సరం ఆగస్టు 01న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం’ జరుపుకుంటారు.

15.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త ఛైర్మన్‌గా 1983 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ‘ప్రీతీ సూదన్’ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

 

అంతర్జాతీయ వార్తలు: ▪️హమాస్ కు చెందిన సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్ ను గాజా లోని ఖాన్ యూనిస్ లో జూలై 13వ తేదీన తాము చేసిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ నిన్ను ప్రకటించింది. ▪️అమెరికా రష్యాల మధ్య మొత్తం 24 మంది ఖైదీలను పరస్పరం మార్చుకోవడానికి సంబంధించి నిన్న కీలక ఒప్పందం కుదిరింది. ▪️భారతదేశంలో పర్యటిస్తున్న వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న వ్యూహాత్మక సంబంధాలను విస్తరించుకునేది దిశగా అనేక రంగాలలో ఆరు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ▪️ఉత్తర కొరియాలో భారీ వర్షాలు వరదల కారణంగా 4100 ఇల్లు ధ్వంసం కాగా 7000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. ▪️పాకిస్తాన్ జైల్లో ఉన్న ఆదేశం మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించిన బ్రిటిష్ అమెరికన్ జర్నలిస్టును పాకిస్తాన్ బహిష్కరించింది. ▪️బాంగ్లాదేశ్ లోని ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం నిన్న జమాతే ఇస్లామీ దాని అనుబంధ విద్యార్థి సంస్థ ఇస్లామి ధాత్ర శిబర్ లను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. 

జాతీయ వార్తలు:- ▪️వెనుకబాటు తన ఆధారంగా ఎస్సీల వర్గీకరణ కు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని ఈ విషయంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను కొట్టివేస్తూ 2004 నవంబర్ 5వ తేదీన ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ▪️భారత సైన్యంలో వైద్య సేవల విభాగం తొలి మహిళా డైరెక్టర్ జనరల్ (డిజి) గా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ నిన్న బాధ్యతలు చేపట్టారు. ▪️కేరళలోని వయనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 190 కి చేరుకోగా ఇంకా 206 మంది జాడ తెలియలేదు. ▪️రైలు ప్రమాదాలను అడ్డుకట్ట వేసేందుకు పదివేల రైలు పెట్టెలలో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ ‘కవచ్ 4.0’ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ▪️ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు వరదల కారణంగా 28 మంది మరణించగా 45 మందికి పైగా గల్లంతయ్యారు. ▪️మోసం ఫోర్జరీ కేసులో మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజ ఖేద్కర్ కు ముందస్తు బైల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ▪️మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయి అంటూ వచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ తాఖీదులు జారీ చేశారు. ▪️ఈసాని రాష్ట్రమైన మేఘాలియాలో బాంగ్లాదేశ్ సరిహద్దులోని గారోహిల్స్ జిల్లాలో ” పిస్తురా సోనారెంజెన్సిస్ ” అనే సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ▪️కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర చట్టాలను సమీక్షించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ శాసనసభ నిన్న తీర్మానం ఆమోదించింది. 

రాష్ట్ర వార్తలు:- ▪️రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరుకున్న కుటుంబాలకు రూ మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ▪️గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ▪️ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిన్న తొలి రోజు 97.5% సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలియజేశారు. ▪️ఈనెల ఐదు మరియు ఆరవ తేదీలో జిల్లా కలెక్టర్ల సదస్సు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు. ▪️డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను ఇకపై బీమా విధానంలో మార్చేలా ప్రతిపాదనలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోంది. ▪️రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల కౌన్సిలింగ్ లో కోర్సులు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు నిన్నటి నుంచి ఐదవ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలియజేశారు. ▪️రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలలో బి బి ఏ, బి సి ఏ కోర్సులకు ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉత్తర్వులు జారీ చేసింది. 

క్రీడావార్తలు:- ▪️పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 59 మీ రైఫిల్ 3 పొజిషన్స్ లో స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం సాధించాడు. ▪️ప్యారిస్ ఒలంపిక్స్ లో ఇప్పటివరకు మొత్తం 11 స్వర్ణ పతకాలతో సహా 23 పథకాలతో చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!